భారత్ లో ఆధ్యాత్మక వేడుకలకు ఓ ప్రత్యేక ప్రాముఖ్యత ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అనేక కులమతాలకు సంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన భారత్ ప్రతీ సంప్రదాయాన్ని ప్రతి ఆచారాన్ని గౌరవిస్తుంది. కానీ కరోనా మహమ్మారి ఈ వేడుకలకు ఆచారాలకు అడ్డుపడుతుంది. ఎంతో ఘనంగా నిర్వహించే రంజాన్ పండుగకు పెద్ద అడ్డుకట్టలా మారి మసీదులకు వెళ్లనివ్వకుండా చేసింది. ఇప్పుడు హిందువులకు ఎంతో ముఖ్యమైన ఆలాయం పురి జగన్నాథుడి ఆలయం యావత్ దేశంలోనే అక్కడ జరిగే రథయాత్రకు విశిష్టత ఉంది. ఎంతో ఘనంగా జనాలకు భక్తులకు కన్నులపందూగగా జరిగే ఈ రథయాత్ర ఇప్పుడు భక్తులు సందర్శకులు లేకుండా జరగాల్సివస్తుంది. ఈ రథయాత్రను ప్రజల్లేకుండా జరిపేందుకు అనుమతించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరింది. కేంద్రం వాదనకు ఒడిశా ప్రభుత్వం సైతం మద్దతుగా నిలిచింది.
కాగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ వేడుక ప్రజల ఆచారాలకు సంప్రదాయాలకు సంబంధించిన విషయమని జూన్ 23 న జరపకపోతే మరో 12 ఏళ్ల పాటు జరపడానికి వీలు పడదని ఆయన తెలియజేశారు. కట్టుదిట్టమైన చర్యలతో భారీ బంధోబస్తు నిర్వహించి కావాలంటే కర్ఫ్యు ఏర్పాటు చేసి కేవలం 600 మండి సేవకులతో రథయాత్ర సఫలమయ్యేలా చేయాలని ఆయన కోర్టును కోరారు. ఆయన వాధానాలు విన్న అనంతరం కోర్టు ఈ విషయంపై లోతైన దర్యాప్తు చేసేందుకు ముగ్గురు న్యాయ నిర్ణేతలతో కూడిన బెంచ్ ను ఏర్పాటు చేశారు. కాగా ఈ మంగళవారం నుండి ప్రారంభంకావలసిన రథయాత్ర జరిగే సూచనలు కనపడకపోయేసరికి ఈసారి రథయాత్ర జరిగేందుకు వీలు పడటం లేదని సుప్రీం తేల్చి చెప్పింది ద్దింతో భక్తుల్లో సందిగ్ధత మొదలైంది.