ఏ రాష్ట్రంలో లేనంతగా ముంబైలో దూసుకుపోతుంది కరోనా. అన్నీ రంగాలను తన పిడికిల్లో పెట్టుకొని వీరవిహంగం చేస్తుంది విద్యారంగాన్ని కూడా అతలాకుతలం చేసేస్తుంది.. ఈ నేపధ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది మహారాష్ట్ర ప్రభుత్వం. చివరి ఏడాది పరీక్షలను రద్దు చేస్తునట్టుగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయినప్పటికి పరీక్షలు రాయాలి అనుకునే విద్యార్థులకు ఓ అవకాశం కల్పించింది. పరీక్షలు రాయాలి అనుకున్న విద్యార్థులు తమతమ యూనివర్సిటీలకు లిఖిత పూర్వక లేఖను ఇవ్వవలసిందిగా ప్రభుత్వం కోరుతుంది.
అయితే సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసి చివరి ఏడాది పరీక్షలు రాయాలనుకోకపోతే వారి గత మార్కులు ఇంటర్నల్స్ మార్కుల ఆధారంగా మార్కులు వేసి వారిని పాస్ చేస్తామని ప్రభుత్వం తెలియజేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, హోటల్ మేనేజ్‌మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షలకు ఇది వర్తిస్తుందని ప్రభుత్వం తెలియజేసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ చివరి ఏడాది విద్యార్థులను పాస్ చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం ప్రభుత్వం చర్చల్లో ఉంది సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయం.