టీం ఇండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా కీలక నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట నుంచి తప్పుకున్న సురేష్ రైనా ఇటీవల శ్రీనగర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో సమావేశమయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ విజ్ఞప్తి మేరకు కాశ్మీర్ డివిజన్ లో ఐదు పాఠశాలలు, జమ్మూ డివిజన్ లో సమాన సంఖ్యలో క్రికెటర్లకు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు సురేష్ రైనా. ఈ విషయం జాతీయ మీడియా చెప్పింది.
లెఫ్టినెంట్ గవర్నర్ క్రికెటర్ యొక్క చర్యను అభినందించారు. కేంద్ర భూభాగంలో క్రీడా సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ సంకల్పం గురించి కూడా ఆయనకు గవర్నర్ వివరించారు. క్రీడలు మరియు విద్యతో, జమ్మూ అండ్ కాశ్మీర్ లో ప్రతిభావంతులైన యువతకు కొత్త దిశానిర్దేశం చేస్తామని చెప్పారు. సురేష్ రైనా ఇటీవల వ్యక్తిగత కారణాలతో ఐపిఎల్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.