ఫిబ్ర‌వ‌రి 18న ‘ఈటీ’ టీజ‌ర్

-

కోలీవుడ్ స్టార్ న‌టుడు సూర్య తాజా చిత్రం త‌ర్కుం తునింధ‌న‌వ‌న్‌తో మ‌ళ్లీ ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతున్నాడు. స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ న‌టుడు సూర్య‌కు ప్రేమ‌గా ప్రియాంక అరుల్ మోహ‌న్ న‌టిస్తోంది. ఇమ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా తెలుగు, హిందీ, క‌న్న‌, మ‌ల‌యాళం భాష‌ల్లో కూడా విడుద‌ల కానున్న విష‌యం తెలిసిన‌దే. ప్ర‌పంచ వ్యాప్తంగా మార్చి 10న ఈ చిత్రం విడుద‌ల‌కు రెడిగా ఉంది.

ఈ చిత్రానికి పాండిరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈటీ పేరుతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్న ఈ సినిమా టీజ‌ర్‌కు ముహుర్తం ఖ‌రారు చేశారు మేక‌ర్స్‌. ఈటీ మూవీ టీజ‌ర్ ను ఫిబ్ర‌వ‌రి 18న సాయంత్రం 6 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్య‌న‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ టీజ‌ర్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఆకాశ‌మే నీ హ‌ద్దురా, జైభీమ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ త‌రువాత సూర్య నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈటీపై భారీ అంచ‌నాలున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news