బాబాయ్ ది గుండెపోటు అనుకుంటివా.. అబ్బాయ్ గొడ్డలి వేటు: జగన్ పై లోకేష్ సంచలన ట్విట్

-

ఏపీలో అధికార వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత దూషణల దాకా వెళ్లాయి విమర్శలు. ఇదిలా ఉంటే రెండు పార్టీల సోషల్ మీడియాలు ప్రత్యర్థి పార్టీల నాయకులను ట్రోల్ చేస్తూ.. విమర్శిస్తున్నారు. ఇదే విధంగా సర్కార్ నిర్ణయాలపై స్ఫూఫ్ వీడియోలు చేసున్నారు. దీనికి రక్త చరిత్రలో జగనాసుర.. తగ్గేదే లే అని టైటిల్ కూడా పెట్టారు.ys jagan on nara lokesh

తాజాగా టీడీపీ కీలక నేత ఎమ్మెల్సీ నారాలోకేష్.. వైఎస్ జగన్ మీద సంచలన ట్విట్ చేశాడు. బాబాయ్ వివేకానంద మర్డర్ పై పుష్ప సినిమా డైలాగ్ తో వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కాలుపై కాలు వేసుకుని ఓ డైలాగ్ చెబుతాడు. దీన్ని వివేకానంద రెడ్డి మర్డర్ కు అన్వయిస్తూ.. ఏపీ సీఎం జగన్ పై ఓ వీడియోను తీశారు. ఈ వీడియోలో బాబాయ్ మావోడే.. అబ్బాయ్ మావోడే.. గొడ్డలి మాదే.. గుండెపోటు కథ కూడా మాదే.. మా బాబాయిని మా అబ్బాయ్ వేసేస్తే మీకేంటబ్బా.. మీ బాబాయ్ని వేసేశారా .. అంటూ డైలాగ్ సాగింది.

Read more RELATED
Recommended to you

Latest news