హస్తంలో కేసీఆర్ ఎఫెక్ట్: రేవంత్‌కు కష్టమేనా?

-

రాజకీయం ఎప్పుడు ఎలా ఎవరిని వలలో వేసుకోవాలో కేసీఆర్‌కు తెలిసినట్లుగా మరో నాయకుడుకు తెలియదనే చెప్పాలి..అసలు ఎప్పుడు ఎలా రాజకీయం నడిపిస్తారో అర్ధం కాదు..శత్రువులని మిత్రులుగా, మిత్రులని శత్రువులుగా చేసేయడంలో కేసీఆర్‌కు సాటి ఎవరు లేరనే చెప్పొచ్చు. అసలు ఇంతకాలం కాంగ్రెస్ పార్టీ…కేసీఆర్‌కు శత్రువుగా ఉన్న విషయం తెలిసిందే…కానీ సడన్‌గా ఇటీవల కేసీఆర్ ఇచ్చిన ట్విస్ట్‌తో కాంగ్రెస్ శ్రేణులు కన్ఫ్యూజన్‌లో పడ్డారు..కేసీఆర్‌ని విమర్శించాలా? వద్దా? అనే డైలమాలో పడ్డారు.

అసలు కాంగ్రెస్ ఊసు ఈ మధ్య కాలంలో పెద్దగా తీయకుండా, బీజేపీపై యుద్ధం చేస్తున్న కేసీఆర్…సడన్‌గా కాంగ్రెస్‌కు మద్ధతు పలికారు. ఇటీవల అసోం సీఎం విశ్వశర్మ…రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే…ఆయన పుట్టుక గురించి ప్రశ్నించారు…దీనిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు..బీజేపీ సీఎం విశ్వశర్మపై ఫైర్ అవుతున్నాయి…ఇదే క్రమంలో కేసీఆర్…విశ్వశర్మ వ్యాఖ్యలని ఖండించి, ఆయనని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

ఇలా అనూహ్యంగా కాంగ్రెస్‌కు, కేసీఆర్ మద్ధతు వచ్చింది..దీంతో తెలంగాణలోని కాంగ్రెస్ శ్రేణులు డైలమాలో పడ్డాయి..అసలు ఇప్పుడు కేసీఆర్‌పై పోరాటం చేయాలా? లేక సపోర్ట్‌గా నిలవలా? అనేది తెలియకుండా ఉన్నారు…అయితే కేసీఆర్‌కు కూడా కావాల్సింది కూడా అదే..కాంగ్రెస్ శ్రేణులని తమ వైపుకు తిప్పుకోవడానికే ఇలా చేశారని చెప్పొచ్చు. కానీ కేసీఆర్ మాటలు నమ్మడానికి వీల్లేదని, ఇప్పటికే ఆయన్ని నమ్మి రెండుసార్లు మోసపోయామని, మళ్ళీ నమ్మి మోసపోలేమని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అసలు టీఆర్ఎస్‌తో కలిసే ప్రసక్తి లేదని, ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్, కాంగ్రెస్ శ్రేణులకు కాస్త క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రేవంత్ రెడ్డి ఒక్కరే ఇలా మాట్లాడుతున్నారు తప్ప…మిగిలిన కాంగ్రెస్ నేతలు ఎవరు కేసీఆర్‌ని విమర్శించడం లేదు..కాంగ్రెస్ సీనియర్లు అంతా సైలెంట్‌గానే ఉండిపోయారు. అంటే రేవంత్‌ది సోలో ఫైట్ అయిపోయింది. అంటే కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ ప్రభావం గట్టిగానే పడిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news