వీసా కోసం వెళ్తే ప్రాణం పోయింది.?

-

కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడు నెలల పాటు అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే . దాదాపుగా అన్ని దేశాలలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది ఇక ఇప్పుడిప్పుడే అన్ని రకాల కార్యకలాపాలు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఎన్నో రోజుల నుంచి వివిధ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి అని ఎదురుచూస్తున్న ప్రజలందరూ ఒక్కసారిగా ఆ సేవలను పొందేందుకు భారీగా తరలి వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే వీసా జారీ లు కూడా గత 7 నెలల నుంచి కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.

ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్లో వీసా జారీ కార్యక్రమం నిర్వహించారు. దీంతో జనాలు తాకిడి ఎక్కువగా ఉండడంతో ఏకంగా ఒక స్పోర్ట్స్ గ్రౌండ్ లో వీసా జారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ క్రమంలోనే నిలిచిపోయిన వీసా దరఖాస్తు ప్రక్రియ మళ్లీ మొదలు కావడంతో భారీ సంఖ్యలో జనాలు అక్కడికి తరలి వచ్చారు. ఇక వారికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఏకంగా తొక్కిసలాటలో 11 మంది మహిళలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news