హైదరాబాద్ వరదల్లో ఆ ఎమ్మెల్యే మాత్రమే మంచి మార్కులు కొట్టేశారా…!

-

వ‌ర‌ద‌ల‌తో ప్రజాప్రతినిధులకు ఎటూ చూసినా నిర‌స‌న‌లు…నిల‌దీత‌లే. ఆ ఎమ్మెల్యే మాత్రం అంద‌రికీ విభిన్నం. వ‌ర్షంలో త‌డుస్తూ బాధితల ప్రజల దగ్గరికి వెళ్లారు. క‌ష్టాల్లో ఉన్న ప్రజలతోనే చ‌ప్పట్లు కొట్టించారు. నగరంలో కురుస్తున్న వర్షాలతో ఎక్కడ చూసినా నీళ్లే. లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. జనమంతా ప్రాణాలు అరచేతపట్టుకుని ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత సాయం చేసినా స‌రిపోవ‌డం లేదు. ఇక ప్రజాప్రతినిధులు, నేతలు తీవ్ర నిర‌స‌న‌లు ఎదుర్కొంటున్నారు. కాల‌నీల‌కు వెళితే మంత్రులు, ఎమ్మెల్యేలు అన్న తేడా లేదు. ఓ కార్పొరేట‌ర్ పై అయితే ఏకంగా బాధిత మహిళ‌లు చేయి కూడా చేసుకున్నారు.

మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం . వర్షంలోనూ కాలనీకి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలకు తనదైనశైలిలో కౌంటర్ ఇస్తూ… కాలనీ వాసులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే మాటలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రజల్లో ఉన్న అసహనాన్ని తట్టుకుంటూనే… వారితో ఆయన మాట్లాడిన తీరు అటు రాజకీయ పక్షాల్లోనూ… ఇటు సామాన్యుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది.

వర్షాలు పడ్డప్పుడు ఎవరినో అంటే పరిష్కారం దొరకదు. ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఈ సమయంలో విమర్శించొద్దు. దేవుళ్లమా మేము ?మంత్ర దండం లేదు. నేను ఇక్కడే ఉంటే.. సమస్యలు ఉండవంటే.. ఇక్కడే కూర్చుంటాను. నాలాలో కొట్టుకుపోయినా ఫర్వాలేదు. ఒట్టేసి చెబుతున్నాను. నన్ను ఎంకరేజ్ చేయండి.. కానీ సూటిపోటి మాటలొద్దు” అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. నాకు 74వేల మెజార్టీ ఇచ్చారు. నా జీవితాన్ని మీకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చేయగలిగినది చేస్తాను అంటూ ప్రజలతో మ‌మేకం అయ్యారు. ఓవైపు వ‌ర్షాలు పడుతుండ‌గానే నాలాల‌పై అక్రమ క‌ట్టడాల‌ను కూల్చివేత మొద‌లుపెట్టారు. నాకు మద్దతివ్వండి ఏ ఒక్క అక్రమ నిర్మాణం ఉండ‌నివ్వన‌ని స్థానికుల మ‌ద్దతు కూడ‌గ‌డుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news