ఆస్కార్ బరిలో ఆకాశం నీ హద్దురా…

Join Our Community
follow manalokam on social media

2020లో రిలీజైన సినిమాలన్నింటిలోకి ఉత్తమ చిత్రంగా చెప్పుకునే ఆకాశం నీ హద్దురా ఆస్కార్ బరిలోకి వెళ్ళనుంది. ఇప్పటివరకు మన దేశం నుండి పంపిన చిత్రాలన్నింటినీ దాటుకుని ఆకాశం నీ హద్దురా ఎంట్రీలోకి వెళ్ళింది. తాజా సమాచారం ప్రకారం బెస్ట్ యాక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ విభాగాల్లో ఎలిజిబిలిటీ టెస్టులోకి ఎంటర్ అయినట్లు తెలుస్తుంది. అక్కడ గెలవగలిగితే గనక ఆస్కార్ గెలవడానికి మరింత ముందుకు వెళ్ళినట్లే. కరోనా మహమ్మారి వల్ల థియేటర్లలో రిలీజ్ కాలేకపోయిన ఈ చిత్రం సూర్య కెరీర్లో అద్భుతమైన చిత్రంగా నిలిచింది.

అప్పటి వరకూ ఫ్లాపుల్లో ఉన్న సూర్యకి ఆకాశం నీ హద్దురా సినిమా మంచి పేరుని తీసుకువచ్చింది. ఇందులో సూర్య నటనకి విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. అటు హీరోయిన్ గా చేసిన అపర్ణ బాలమురళికి కూడా మంచి పేరు వచ్చింది. తెలుగు ప్రాంతానికి చెందిన సుధ కొంగర దర్శకత్వం చేసిన ఈ సినిమా అస్కార్ దాకా వెళ్తుందో లేదో చూడాలి.

TOP STORIES

ఉగాది స్పెషల్: ఉగాది పచ్చడి ఇలా చేస్తే అమృతంలా ఉంటుంది…!

ఈసారి ప్లవ నామ సంవత్సరం వచ్చేస్తోంది. శార్వరి నామ సంవత్సరానికి స్వస్తి పలికి ప్లవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుదాం. సాధారణంగా ఉగాది అంటే అందరికీ గుర్తొచ్చేది...