ఉత్తరప్రదేశ్‌లో ఒక జంట అంగరంగ వైభవంగా పెళ్లి వేడుకులు జరుపుకున్నారు. చూడ ముచ్చటైన జంటను చూసి పెళ్లికి హాజరైన పెద్దలందరూ ఆశీర్వాదించారు. పెళ్లి వేడుకులు ముగించుకుని గృహప్రవేశం చేయాల్సిన జంట హఠాత్తుగా ఎక్కడికో బయలుదేరి వెళ్లారు. ఇదంతా చూస్తున్న బంధువులకు, కుటుంబ సభ్యులకు కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. వాళ్లు వెళ్లింది హాస్పిటల్‌కు అని తెలుసుకుని ఆశ్చర్యపోవటం వాళ్ల వంతైంది.
అసలు వధువరులు ఆసుపత్రికు ఎందుకు వెళ్లారనేది అందరిని మదిలో మెదులుతున్న ప్రశ్న. అయితే వారు ఆసుపత్రికి వెళ్లింది ఓ చిన్నారి ప్రాణం కాపాడటానికే. సమయానికి రక్తం లభించక.. ప్రాణాల కోసం పోరాడుతున్న క్షణాల్లో వధువరులు ఆ చిన్నారికి ఊపిరి పోశారు. పెళ్లి మండపం నుంచి నేరుగా హాస్పిటల్‌కు వెళ్లి.. రక్తదానం చేశారు. ఆ రాష్ట్ర పోలీసుల సైతం వాళ్లి ప్రశంసలతో ముంచేత్తారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పోలీస్ అధికారి ఆశిష్ కుమార్ మిశ్రా చేసిన ట్వీట్‌తో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్వీట్‌లో పెట్టిన చిత్రంలో వరుడు రక్తదానం చేస్తుంటే వధువు పక్కనే నిలుచుని ఉంది.
मेरा भारत महान |
एक बच्ची को ब्लड की जरूरत थी,कोई भी रक्तदान करने को सामने नही आ रहा था, क्योंकि वो किसी दूसरे की बच्ची थी,अपनी होती तो शायद कर भी देते,
खैर, शादी के दिन ही इस जोड़े ने रक्तदान कर बच्ची की जान बचायी |
Jai Hind,#PoliceMitra #UpPoliceMitra #BloodDonation pic.twitter.com/tXctaRe1nR— Ashish Kr Mishra (@IndianCopAshish) February 22, 2021
ఆ దృశ్యాన్ని వివరిస్తూ ‘నా దేశం ఎంతో గొప్పది.. ఓ బాలికకు అత్యవసరంగా రక్తం అవసరమైంది. కానీ, ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకంటే ఆమె వేరొకరి బిడ్డ. కానీ, ఆ వధువరులు అలా భావించలేదు. రక్తదానం చేసి ఆ బాలిక ప్రాణాలు కాపాడారు.’’ అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. వధువరులు పెళ్లి దుస్తుల్లోనే నేరుగా హాస్పిటల్‌కు రావడం గమనార్హం. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆ పెళ్లి జంట సామాజిక బాధ్యతను కొనియాడుతున్నారు. పెళ్లి కంటే గొప్పదైన పని చేశారని మెచ్చుకుంటున్నారు. పెళ్లి జరుగుతున్నా సరే.. చిన్నారి ప్రాణం కాపాడేందుకు కదిలి వచ్చినందుకు మీకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనని సెల్యూట్ కొడుతున్నారు.