నా గుండె బద్దలైంది: సూర్య కుమార్ యాదవ్

అహమ్మదాబాద్ లో నిన్న ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ సేన దారుణంగా ఫెయిల్ అయ్యి ఓటమిని మూటగట్టుకుని వరల్డ్ కప్ ను పోగొట్టుకుంది. ఈ ఓటమిపై ఇప్పటికే మాజీ ఇండియా ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా టీం ఇండియా కీలక ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ తన బాధను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. సూర్య ఈ ట్వీట్ లో “సూర్య కుమార్ యాదవ్ నా గుండె బద్దలైంది, ఈ ఘోర ఓటమి నుండి బయటపడడానికి చాలా సమయం పడుతుంది. ఇంతకాలం టీం కు గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా అందరం కలిసే ఉన్నాము. ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ఈ ఓటమి నుండి బయటపడడానికి ప్రయత్నిస్తాము అంటూ మెసేజ్ చేయడం చాలా మందిని బాధకు గురి చేస్తోంది అని చెప్పాలి.

మేము ఒక టీం గా మైందనంలోకి అడుగు పెట్టిన ప్రతిసారీ మీ ప్రేమ, మద్దతు ఇచ్చినందుకు థాంక్స్ అంటూ చెప్పడం అందరినీ హృదయాలను టచ్ చేసింది అని చెప్పాలి.