Surya 41 : దర్శకుడు బాలాతో “సూర్య” కొత్త సినిమా..

-

కరోనా, లాక్‌డౌన్ స‌మ‌యంలో ఆకాశం నీ హ‌ద్దురా, జై భీమ్ వంటి అద్భుత‌మైన చిత్రాల్లో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేసిన కోలివుడ్ స్టార్ సూర్య…ఇప్పుడు కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు వచ్చాడు. ఇక ఇటీవలే స‌న్ పిక్ష‌ర్స్ ప‌తాకంపై క‌ళానిధి మార‌న్ నిర్మాత‌గా పాండిరాజ్ ద‌ర్శ‌కత్వంలో యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ చిత్రం ఈటీ {ఎవరికీ తలవంచడు}ని చేశాడు సూర్య.

సూర్య‌కు ఉన్న భారీ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగులో ఈటీ పేరుతో విడుద‌ల చేసింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో సినిమా అనౌన్స్‌ చేసాడు సూర్య. సంచలన దర్శకుడు బాలా తో తన 41 వ మూవీని చేస్తున్నట్లు ప్రకటించాడు సూర్య.

ఈ మేరకు ఓ పోస్టర్‌ కూడా తన సోషల్‌ మీడియాలో వదిలాడు. అయితే.. ఈ సినిమా తన సొంత బ్యానర్‌ పైనే తెరకెక్కిస్తున్నారు. సినిమా అఫిషియల్‌ గా ప్రకటించినప్పటికీ.. ఈ సినిమాలో పాత్రలను అనౌన్స్‌ చేయలేదు. త్వరలోనే పాత్రలతో పాటు షూటింగ్‌ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news