సుశాంత్‌, రియాల అన్‌సీన్ వీడియో.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..

-

బాలీవుడ్ న‌టుడు సుశాంత్, న‌టి రియా చక్ర‌వ‌ర్తిలు ఎప్ప‌టి నుంచో స‌హ‌జీవ‌నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే సుశాంత్ చ‌నిపోవ‌డంతో అందుకు కార‌ణం రియానే అని చాలా మంది ఆరోపిస్తున్నారు. అలాగే మరో వైపు సీబీఐ, ఈడీ, ఎన్‌సీబీలు ఈ కేసును ముమ్మ‌రంగా ద‌ర్యాప్తు చేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సుశాంత్‌, రియాల‌కు చెందిన ఓ అన్‌సీన్ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఓ వీడియోలో సుశాంత్ ప‌డుకుని బుక్ చ‌దువుతుండ‌గా, రియా అత‌ని వీడియోను చిత్రీక‌రించింది. వారు ఆ స‌మ‌యంలో లూడో గేమ్ గురించి మాట్లాడుకున్నారు. త‌రువాత సుశాంత్ హ్యాండ్‌స‌మ్‌గా ఉన్నాడ‌ని రియా కాంప్లిమెంట్స్ ఇచ్చింది. అనంత‌రం ఎవ‌రో వ్య‌క్తి ప‌క్క నుంచి మెడిసిన్స్ తీసుకున్నావా, లేదా అని అడిగాడు. కాగా ఈ వీడియోను ఓ మీడియా సంస్థ సేక‌రించ‌గా.. దీన్ని ప్ర‌స్తుతం సుశాంత్ ఫ్యాన్స్ వైర‌ల్ చేస్తున్నారు.

ఇక మ‌రోవైపు రియాను ఇప్ప‌టికే ఎన్‌సీబీ అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజ‌రు ప‌ర‌చ‌గా.. న్యాయ‌మూర్తి ఆమెకు 14 రోజుల క‌స్ట‌డీ విధించారు. దీంతో ఆమెను ఎన్‌సీబీ జైలుకు త‌ర‌లించింది. ఈ క్ర‌మంలోనే ఆమె బాలీవుడ్‌లో 80 శాతం మంది న‌టులు డ్ర‌గ్స్ తీసుకుంటార‌ని ఎన్‌సీబీకి చెప్పిన‌ట్లు తెలిసింది. అయితే ఎన్‌సీబీ ఈ విష‌యంపై ఎలా వ్య‌వ‌హ‌రిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version