బెంగాలీ మ‌హిళ‌ల‌పై సుశాంత్ ఫ్యాన్స్ దూష‌ణ‌లు.. రియా చ‌క్ర‌వర్తే కార‌ణం..!

-

సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ చ‌నిపోయేందుకు అత‌ని గ‌ర్ల్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తే కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన‌ప్ప‌టి నుంచి రియా చ‌క్ర‌వ‌ర్తిని సోష‌ల్ మీడియాలో తీవ్రంగా దూషిస్తున్నారు. సుశాంత్‌ను ఆమే చంపేసింద‌ని, ఆమె ఓ విష‌క‌న్య అని ఓ ప్ర‌ముఖ నేత కూడా వ్యాఖ్యానించారు. దేశ‌వ్యాప్తంగా ఉన్న సుశాంత్ ఫ్యాన్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో రియాపై దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఇది ఇక్క‌డితో ఆగ‌లేదు. రియా బెంగాలీ కావ‌డంతో ఇప్పుడు బెంగాలీ మ‌హిళ‌ల‌పై సుశాంత్ ఫ్యాన్స్ దూష‌ణ‌ల ప‌ర్వం మొద‌లు పెట్టారు.

sushant fans abusing comments on bengali women

బెంగాలీ మ‌హిళ‌లు క్షుద్ర పూజ‌లు, చేత‌బ‌డి చేస్తార‌ని, వారు మ‌గ‌వారిని తోలుబొమ్మ‌ల్లా ఆడిస్తార‌ని, మ‌గ‌వారిని ఏటీఎంల‌లా ఉప‌యోగించుకుంటార‌ని, త‌మ అంద‌చందాల‌తో బెంగాలీ మ‌హిళ‌లు మ‌గ‌వాళ్ల‌ను సుల‌భంగా ఆక‌ర్షించి, వారి ధ‌నాన్ని, పేరును దోచేస్తార‌ని.. నెటిజ‌న్లు ప్ర‌స్తుతం దూషిస్తున్నారు. బెంగాల్ మ‌గ‌వారు త‌మ ఆడ‌వాళ్ల‌ను చెప్పు చేత‌ల్లో పెట్టుకోలేని వేస్ట్ ఫెలోస్ అని కూడా దూషిస్తున్నారు. చ‌క్ర‌వ‌ర్తి అని పేరులో ఉన్న ఆడ‌వాళ్ల‌ను వారు దూషిస్తున్నారు.

అయితే మ‌రోవైపు సుశాంత్ సింగ్ ఆత్మ‌హ‌త్య కేసులో త‌వ్వేకొద్దీ కొత్త కొత్త విష‌యాలు బ‌య‌ట ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే రియా చక్ర‌వ‌ర్తి సుశాంత్ బ్యాంక్ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంద‌ని అత‌ని బ్యాంక్ స్టేట్‌మెంట్ల ద్వారా తెలియ‌గా.. సుశాంత్ ద‌గ్గ‌ర కుక్‌గా ప‌నిచేసి, రియాచే తీసేయ‌బ‌డ్డ వ్య‌క్తి రియా గురించిన‌ సంచ‌ల‌న విష‌యాల‌ను తెలిపాడు. దీంతో ఫ్యాన్స్ రియాపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. చివ‌ర‌కు ఇది ఎక్క‌డి వ‌ర‌కు దారి తీస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news