మళ్లీ జీవం పోసుకున్న సుశాంత్ సింగ్..!

-

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య నుంచి అభిమానులు ఇప్పటికీ కూడా బయటకు రాలేక పోతున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరోసారి జీవం పోసుకున్నాడు . అదెలా అనుకుంటున్నారా… పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్ కి చెందిన ప్రముఖ శిల్పి సుకాంతో రాయి… బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మైనపు బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మలు చూస్తే ఉంటే అచ్చం సుశాంత్ సింగ్ కళ్లముందే ఉన్నట్లుగా ఉంది. ప్రస్తుతం ఇది చూసిన అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.


ఇన్నాళ్ళకి సుశాంత్ సింగ్ మళ్లీ కళ్ళముందే ఉన్నాడు అనిపించేలా శిల్పం తయారు చేసిన సదరు వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుతున్నారు . ప్రస్తుతం ఎంతో స్టైల్ గా నిలబడి నవ్వుతూ ఉన్న సుశాంత్ సింగ్ రాజ్పుత్ మైనపు బొమ్మ ఎంతో మందిని ఆకట్టుకుంటుంది. హీరో సుశాంత్ కి తాను అభిమానిని అంటూ తెలిపిన శిల్పి సుకాంతో రాయి.. అతని మరణం తనకు ఎంతో బాధ కలిగించింది అంటూ చెప్పుకొచ్చారు. అందుకే ఆయన జ్ఞాపకార్ధం ఈ మైనపు బొమ్మను తయారు చేసి తన మ్యూజియంలో ఉంచినట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఒకవేళ సుశాంత్ తల్లిదండ్రులు కోరితే మరో కొత్త మైనపు బొమ్మ కూడా తయారు చేసిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు సదరు శిల్పి.

Read more RELATED
Recommended to you

Exit mobile version