మాజీ విశ్వసుందరి.. బాలీవుడ్ స్టార్ సుస్మితాసేన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇక ఈ బ్యూటీకి ఫిట్‌నెస్‌పై ఉన్న ప్రేమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెగ్యులర్‌గా జిమ్‌కు వెళ్తూ.. కఠినమైన కసరత్తులు చేస్తూ ఆ ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది. తన మాజీ బాయ్‌ఫ్రెండ్ రోహ్మన్ షాల్‌తో కలిసి అప్పట్లో జిమ్‌కు వెళ్లేది. అక్కడ ఇద్దరూ కలిసి ఎక్సర్సైజ్ చేసిన ఫొటోలు పోస్టు చేసేది.
అయితే ఇటీవల సుస్మితా సేన్‌కు గుండెపోటు రావడంతో వైద్యులు యాంజియోప్లాస్టీ చేసి స్టంట్ వేశారు. ప్రస్తుతం గుండెపోటు నుంచి కోలుకున్న ఆమె మళ్లీ జిమ్ బాట పట్టింది. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడిలో సుస్మిత, ఆమె కుమార్తె అలీశా, సుస్మిత మాజీ ప్రియుడు రోహ్మన్ షాల్ ఉన్నారు. వీరందరూ కొన్ని రకాల వ్యాయామాలు చేశారు.
ఈ వీడియో కింద..’సంకల్పం ఒక్కటే మార్గం. మరింత శిక్షణకు అనుమతి లభించింది. నా ప్రియమైన వాళ్లు తిరిగి నేను ఎక్సర్సైజ్ చేసేందుకు సాయం చేస్తున్నారు. అలీశాకు, రోహ్మన్ షాల్‌కు నేను కిసెస్ పంపిస్తున్నాను. ఐ లవ్యూ గయ్స్..’ అంటూ సుస్మిత క్యాప్షన్ జోడించింది.