ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే..!

-

సమ్మర్ హాలిడేస్ ను క్యాష్ చేసుకోవడానికి చాలామంది దర్శకనిర్మాతలు, హీరోలు సమ్మర్ లోనే తమ సినిమాలను విడుదల చేయాలని గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే మార్చి మొదలుకొని మే ఎండింగ్ వరకు సమ్మర్లో వినోదాన్ని పెంచటానికి థియేటర్స్ వద్ద చాలా సినిమాలు క్యూ కడుతున్నాయి. మరీ ముఖ్యంగా సమ్మర్ టార్గెట్ గా బడా హీరోలు వారి సినిమాలను రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా సినిమాలు ఇప్పుడు సమ్మర్ లో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి మరి ఈ సమ్మర్లో మరి ముఖ్యంగా ఏప్రిల్ నెలలో విడుదల కాబోతున్న సినిమాల గురించి మనం చూద్దాం.

ఈనెల 7వ తేదీన అనగా రేపు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న రావణాసుర సినిమా విడుదల కాబోతోంది. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల హిట్టుతో ఫుల్ జోష్ లో ఉన్న రవితేజ ఇప్పుడు రావణాసుర సినిమాతో కూడా అదే సక్సెస్ కొనసాగించాలని చూస్తున్నాడు. మరొకవైపు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఇదే రోజున తన మీటర్ సినిమాను విడుదల చేయబోతున్నారు.

ఇక మరొక వారం గ్యాప్ తీసుకొని ఏప్రిల్ 14వ తేదీన దర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న పీరియాడికల్ చిత్రం శాకుంతలం విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో సమంత ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ సెరవేగంగా జరుగుతున్నాయి. ఇక దీని తర్వాత ఏప్రిల్ 21వ తేదీన యాక్సిడెంట్ తర్వాత సాయిధరమ్ తేజ్ నటిస్తున్న విరూపాక్ష చిత్రం విడుదల కాబోతోంది.

ఏప్రిల్ 28వ తేదీన మోస్ట్ అవైటెడ్ మూవీ ఏజెంట్ కూడా రిలీజ్ కాబోతోంది . అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు సినిమా ప్రమోషన్స్ చేపట్టకపోవడంతో సినిమా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరొకవైపు మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 కూడా ఏప్రిల్ 28న రిలీజ్ కాబోతోంది. వీటితోపాటు చిన్న సినిమాలు , మీడియం రేంజ్ సినిమాలు, డబ్బింగ్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news