నైట్ క్లబ్‌లో దారుణం.. అనుమానాస్పదంగా 17 మంది మృతి!

-

దక్షిణాఫ్రికాలోని ఈస్ట్ లండన్ సిటీలో దారుణ ఘటన సంభవించింది. వీకెంట్ నైట్ క్లబ్‌లో ఏకంగా 17 మంది మృతి చెందారు. అయితే వారు ఎలా మరణించారనే విషయం అనుమానాస్పదంగా మారింది. ఆదివారం తెల్లవారుజామున ఎన్యోబెని టావెర్న్ క్లబ్‌లో మృతదేహాలు కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

నైట్ క్లబ్
నైట్ క్లబ్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుల శరీరాలపై ఎలాంటి గాయాలు లేవని పేర్కొన్నారు. సీనరీ పార్క్ సిటీకి మూడు కిలోమీటర్ల దూరంలో ఉందని ఈస్టర్న్ కేఫ్ పోలీస్ ప్రతినిధి బ్రిగేడియర్ టెంబిన్‌కోసి కినాన అన్నారు. నైట్ క్లబ్‌లో మృతదేహాలు చెల్లాచెదురుగా కనిపించాయని పేర్కొన్నారు. మరణించిన వారిలో ఎక్కువ మంది 18-20 ఏళ్ల వారు ఉన్నట్లు తెలిపారు. కాగా, మరో వైపు మృతుల కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకు దిగారు. తమ బిడ్డలను ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news