ఎదురుగా వచ్చిన వాహనదారులను ఓ ఎస్‌యూవీ కారు గుద్దుకుంటూ వెళ్లింది.ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం జైపూర్‌లోని నహర్ గడ్ ప్రాంతంలో మంగళవారం ఆలస్యంగా వెలుగుచూసింది. చిన్న గల్లీలోకి ఎంటర్ అయిన ఓ SUV కారు అతివేగంతో దూసుకువెళ్లింది.
ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారులపైకి కారు డ్రైవర్ పోనివ్వడంతో ఇద్దరు మృతి చెందగా..పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కాగా, ప్రమాదం చేసిన కారు వెంట కొందరు పరుగెత్తుకెళ్లిన విజువల్స్ సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కారు భీభత్సం
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జైపూర్‌లోని నహర్గడ్ ప్రాంతంలో ఒక SUV కారు అతివేగంతో రోడ్డుపై బైక్ల మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు. pic.twitter.com/JvJYJCt4Ov
— ChotaNews App (@ChotaNewsApp) April 8, 2025