ఏపీలో టెరిఫిక్ దొంగతనం..కియా కార్ల ఫ్యాక్టరీలో 900 ఇంజిన్లు మాయం

-

ఏపీలో ఎవ్వరూ ఊహించని విధంగా భారీ దొంగతనం జరిగింది. కియా కార్ల ఫ్యాక్టరీలో ఏకంగా 900 ఇంజిన్లు చోరీకి గురయ్యాయి.రాష్ట్రంలోని శ్రీ సత్య సాయి జిల్లాలో కియా కార్ల పరిశ్రమ తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కార్లు ఇక్కడి నుంచి సరఫరా అవుతాయి.

అయితే, గత మార్చి నెలలో ఫ్యాక్టరీలో భారీ చోరీ జరిగింది.ఈ విషయాన్ని కంపెనీ యాజమాన్యం గుప్తంగా ఉంచి ఫిర్యాదు లేకుండానే దర్యాప్తు చేయాలని ఏపీ పోలీసులను కియా యాజమాన్యం కోరినట్లు పోలీసులు తెలిపారు.కానీ, అందుకు తాము అంగీకరించలేదని.. దీంతో మార్చి 19న ఈ దొంగతనంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.ప్రత్యేక దర్యాప్తు బృందాలు దొంగల కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంతా షాక్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news