బ్రేకింగ్: వేరే రాష్ట్రానికి వెళ్తే స్వాబ్ టెస్ట్ అవసరం లేదు, కరోనా టెస్ట్ న్యూ రూల్స్

-

కరోనా వైరస్ కేసుల తీవ్రత నేపధ్యంలో డయాగ్నొస్టిక్ ల్యాబ్‌ లపై ఒత్తిడిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావైరస్-పరీక్ష నిబంధనలను సవరించింది. కోలుకున్న తర్వాత ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న “హెల్తీ” ఇంటర్-స్టేట్ ట్రావెలర్స్ కు పరిక్షలు అవసరం లేదని స్పష్టం చేసింది. కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో 2,500 కి పైగా ల్యాబ్‌లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయని కేంద్రం తెలిపింది. ప్రయోగశాలలపై భారాన్ని తగ్గించడానికి అంతర్-రాష్ట్ర దేశీయ ప్రయాణాన్ని చేపట్టే ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఈ టెస్ట్ అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు ఉత్తర్వులు పంపింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో కోవిడ్ -19 కోలుకున్న వ్యక్తులకు ఎటువంటి పరీక్ష అవసరం లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news