ఈటెల రాజకీయ జీవితంలో కీ డే…?

తెలంగాణాలో మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటీ అనే దానిపై ఒక స్పష్టత ఇవ్వడం లేదు. ఇక ఆయనపై మంత్రులు నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఈటెల భవిష్యత్ పై నేడు కీ డే గా తెలంగాణా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నేడు హుజురాబాద్ లో మరికొంత మంది నేతల అభిప్రాయాలు తీసుకోనున్న ఈటెల.. ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తారు.

రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. పార్టీ నుంచి బయటకు వస్తారా? ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా ? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రకటన తన నియోజకవర్గ ప్రజల మద్యే ఉంటుందని ఆయన సన్నిహితులు అంటున్నారు.