మాస్ డైరెక్టర్ కొరటాల శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.కొరటాల శివ ఇటీవల తెరకెక్కించిన ఆచార్య చిత్రం రేపు థియేటర్లలో విడుదల కానుంది.మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇందులో సోనూసూద్ ప్రతినాయకుడి పాత్రలో..పూజా హెగ్డే కీలక పాత్రలో నటించారు.ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ శరవేగంగా ప్రమోషన్స్ చేస్తుంది.ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న డైరెక్టర్ కొరటాల శివ, రామ్ చరణ్, చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
కొరటాల శివ మాట్లాడుతూ…స్వామి వివేకానంద జీవితం పై గాంధీ తరహా సినిమా చేయాలని ఉంది..ఎప్పుడు అవుతుందో తెలియదు..నేను ఎంత పరిశోధన చేసి..అంత అనుభవం వచ్చిందంటే చేస్తా..నేను తెలుసుకున్న గొప్ప వ్యక్తుల జీవితాల్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి స్వామి వివేకానంద.ఆయన బోధనలు, సందేశాలు ప్రపంచానికి చేరాలంటే ఆయన జీవితం తెరకెక్కాల్సిందే అనిపిస్తుంది.చేస్తే హాలీవుడ్ వాళ్ళు గాంధీ సినిమా ను తీసినట్టుగా పెద్ద స్థాయిలో తీయాలి అన్నారు.ఇక నా తర్వాతి సినిమా తారక్ తో ఉంటుంది.హై వోల్టేజ్ సినిమా అది..మే 20 ఎన్టీఆర్ పుట్టిన రోజున ఆ సినిమాకు సంబంధించిన విషయాలు ప్రకటిస్తాం అంటూ చెప్పుకొచ్చారు కొరటాల శివ.