హిందీ జాతీయ భాష కాదు అంటూ కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ చేసిన వ్యాఖ్యలు నార్త్, సౌత్ స్టార్స్ మధ్య యుద్ధానికి తెర లేపింది. దీనికి బదులుగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్.. హిందీ మన జాతీయ భాష అని, హిందీ జాతీయ భాష కాకపోతే దక్షిణాది చిత్రాలను హిందీలో ఎందుకు డబ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల కిచ్చా సుదీప్ ఓ సినిమా కార్యక్రమంలో కేజీఎఫ్ 2పై ప్రశంసలు కురిపిస్తూ… హిందీ జాతీయ భాష కాదంటూ వ్యాఖ్యానించారు. అయితే అజయ్ దేవ్ గన్ ట్వీట్ పై స్పందించిన కిచ్చా సుదీప్ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని విమరణ ఇచ్చారు.
ప్రస్తుతం ఈ వివాదంలోకి వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ ఇచ్చాడు. తనదైన శైలిలో ఓ ట్వీట్ వదిలాడు. సౌత్ స్టార్స్ పై నార్త్ స్టార్స్ అసూయతో అభద్రతా భావంతో ఉన్నారని.. కన్నడ సినిమా కేజీఎఫ్ 2 ఓపెనింగ్ రోజే రూ. 50 కొల్లగొట్టిందని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
The base undeniable ground truth @KicchaSudeep sir ,is that the north stars are insecure and jealous of the south stars because a Kannada dubbing film #KGF2 had a 50 crore opening day and we all are going to see the coming opening days of Hindi films
— Ram Gopal Varma (@RGVzoomin) April 27, 2022