సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ కన్నుమూశారు. లివర్ సిరోసిస్ తో బాధపడుతున్న స్వామి అగ్నివేష్, మంగళవారం రోజు నుండి వెంటిలేటర్ పైనే ఉన్నారు. ఇతర సమస్యలు కూడా తోడవడంతో స్వామి అగ్నివేష్, ఇక పోరాటం చేయలేక దేహం వదిలారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన లివర్ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన స్వామి అగ్నివేష్, కుటుంబాన్ని వదిలి సన్యాసాన్ని తీసుకున్నారు.
వెట్టిచాకిరిపై ఆయన చేసిన ఉద్యమం రాజకీయాల్లోకి తీసుకెళ్ళింది. 1977లో హర్యానా అసెంబ్లీకి ఎన్నికైన అగ్నివేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. ఆ తర్వాత రెండు సంవత్సరాలకి ఆ పదవి నుండి బయటకి వచ్చారు. అన్నాహజారే చేపట్టిన ఉద్యమంలో స్వామి అగ్నివేష్ పాలుపందుకున్నారు. 2018లో అటల్ బీహారీ వాజ్ పేయికి నివాళి అర్పించడానికి వెళ్తుండగా మార్గమధ్యంలో అగ్నివేష్ పై దాడి జరిగింది.