బెల్లంకొండ గణేష్ “స్వాతి ముత్యం” రిలీజ్ కొత్త డేట్ ఫిక్స్.!

-

బెల్లంకొండ ఫ్యామిలీ నుంచి వస్తున్న మరో హీరో గణేష్. ఇప్పటికే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పుడు ఆయన తమ్ముడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ స్వాతిముత్యం.

ఓ అమ్మాయికి మరియు ఓ అబ్బాయికి మధ్య పరిచయం, అది ప్రేమ వైపు సాగే ప్రయాణం, దాని తాలూకు అనుభూతులు అలాగే జరిగే సంఘటనలు ఇవన్నీ స్వాతిముత్యం సినిమాలో చూపించనున్నారు.

ప్రముఖచిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై యువ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్గా నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమా విడుదల తేదీని తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. దసరా కానుకగా అంటే అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version