ఒలంపిక్స్ లో పతకాలు పొందడం అంత సులభం కాదు. దానికి తగ్గ సాధన ఉండాలి. అయితే ఒకేసారి ఒలింపిక్స్ లో ఏడు పతకాలు పొందింది ఆస్ట్రేలియన్ స్విమ్మర్ ఎమ్మా మెక్‌కియోన్ (Emma McKeon). ఇలా ప్రదర్శించడం నిజంగా ఎంతో గొప్ప విషయం. ఆస్ట్రేలియాకు చెందిన ఎమ్మా మెక్‌కియోన్ ఒకటి కాదు రెండు కాదు మొత్తం ఏడు పతకాలని పొందింది. 1952 లో సోవియట్ జిమ్నాస్ట్ మరియా గోరోఖోవ్స్కాయ రికార్డ్ తరవాత ఏడు పతకాలు సాధించిన రెండవ మహిళ కూడా మెక్‌కియోన్.
ఈమె ఏడవ పతకం 4×100 మెడ్లే రిలేలో వచ్చింది. సింగిల్ గేమ్స్ లో ఇన్ని పతకాలని పొందిన ఏకైక మహిళా స్విమ్మర్‌గా నిలిచింది. ఇలా ఈమె అద్భుతమైన రికార్డుని సృష్టించింది. స్ట్రోక్-ఫర్-స్ట్రోక్ ఫైనల్ ల్యాప్ లో యునైటెడ్ స్టేట్స్‌ని అధిగమించి ఈమె 3:51:60 సమయంతో ఆస్ట్రేలియా రేసులో ఒలింపిక్ రికార్డు సృష్టించింది.
పతకాల వివరాలు:
4×100 ఫ్రీ స్టైల్ రిలే (స్వర్ణం, ప్రపంచ రికార్డు)
100 ఫ్రీ (స్వర్ణం, ఒలింపిక్ రికార్డు)
50 ఫ్రీ (స్వర్ణం)
100 butterfly (కాంస్య పతకం)
4×200 ఫ్రీ రిలే (కాంస్య పతకం)
4×100 mixed medley relay (కాంస్య పతకం)
4×100 medley రిలే (స్వర్ణం, ఒలింపిక్ రికార్డు)
Games in Rio de Janeiro లో నాలుగు పతకాలు సాధించింది.