మీరు స్మార్ట్‌ఫోన్ వినియోగదారులా? యాపిల్ ఐఫోన్, ఆండ్రాయిడ్ మొబైల్, విండోస్ ఫోన్లను వాడుతున్నారా? అయితే, మీ ఫోన్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్, విండోస్ ఓఎస్, గూగుల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఆపరేటింగ్ సిస్ట అత్యంత బలహీనమైన రక్షణ వ్యవస్థ కలిగి ఉన్నాయని, ఈ ఫోనులు హ్యాకింగ్ గురయ్యే ముప్పు అత్యధికమని సైబర్‌సెక్యూరిటీ విభాగం సీఈఆర్-ఇన్ హెచ్చరికలు జారీ చేసింది.
ఈ కంపెనీల ఫోన్లను సైబర్ నేరగాళ్లు సులువుగా హ్యాకింగ్ చేసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఈ నేపథ్యంలో యాపిల్, ఆండ్రాయిడ్, విండోస్ మొబైల్ ఫోన్ వినియోగదారులు వెంటనే అందుబాటులో ఉన్న ‘హ్యాకింగ్ ముప్పు నుంచి రక్షించే’ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకొని, తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచించింది.అయితే, ఉపశమనం కలిగించే విషయం ఏమిటంటే ఇప్పటికే యాపిల్, గూగుల్ కంపెనీలు సమస్యను గుర్తించి హ్యాకింగ్ ముప్పును తప్పించే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాయి. వెంటనే స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు చేయాల్సింది ఒక్కటే. అందుబాటులో నూతన ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని హ్యాకింగ్ బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలి.
ఆండ్రాయిడ్
ఆండ్రాయిడ్ ఫోన్లలో బలహీనమైన సిగ్నల్ అప్లికేషన్‌ను కలిగి ఉన్నాయని సీఆర్‌ఈటీ-ఇన్ తెలిపింది. ఈ కారణంగా ఉద్దేశపూర్వకంగా యాదృచ్ఛికమైన ఫొటోలను పంపించి హ్యాకింగ్‌కు పాల్పడే అవకాశం ఉన్నది. ఈ సమస్యను అధిగమించడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ వినియోగదారులు సిగ్నల్ వర్షన్ 5.17.3ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సైబర్‌సెక్యూరిటీ ఏజెన్సీ సూచించింది.
విండోస్
ఇక, విండోస్ విషయానికి వస్తే.. ఏదైనా వ్యవస్థను టార్గెట్ చేసి బగ్ పంపినప్పుడు మొబైల్ ఫోన్ పూర్తిగా హ్యాకర్ నియంత్రణలోకి వెళ్లడాన్ని విండోస్ అనుమతిస్తుందని సీఆర్‌ఈటీ-ఇన్ తెలిపింది. ఇది ఎంత ప్రమాదకరం అంటే.. మీ ఫోన్ వర్జినల్ ఇన్‌స్టాలేషన్ పాస్‌వర్డ్స్, అకౌంట్ పాస్‌వర్డ్ హ్యాషెష్‌ను తెలుసుకోవడానికి దోహదపడుతుంది. ఈ బలహీనత మైక్రోసాఫ్ట్ సీవీఈ-2021-36934లో అత్యధిక ఉన్నట్లు పేర్కొన్నది. అయితే, ఇప్పటివరకు విండోస్‌లోని ఈ బలహీనత కారణంగా ఫోన్లు హ్యాకింగ్‌కు గురికాలేదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.
యాపిల్
చివరగా.. యాపిల్ డివైస్‌లు. ఏకపక్షంగా కోడ్‌ను పంపించడం ద్వారా రిమోట్ హ్యాకర్లు తాము అనుకున్నది చేసే అవకాశాన్ని కల్పించడం ఐఓఎస్, ఐప్యాడ్‌ఓఎస్ డివైజ్‌లకు ఉన్న బలహీనత అని సైబర్ సెక్యూరిటీ సంస్థ తెలిపింది. దీని ద్వారా ఏదైనా వ్యవస్థను టార్గెట్ చేసి హ్యాకర్లు తమ నియంత్రణలో తెచ్చుకొనే అవకాశం ఉన్నది. ఈ బగ్‌ను ఎదుర్కోవడం కోసం యాపిల్ సంస్థ నూతన సాఫ్ట్‌వేర్ ఫిక్సేషన్‌ను విడుదల చేసింది.