కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్.. పురుషుల స్విమ్మింగ్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఈవెంట్‌లో ఫైనల్స్‌కు ప్రవేశించాడు. సెమీస్‌లో అతను 54:55 సెకన్లలో ఈవెంట్‌ను క్లోజ్ చేశాడు. 21 ఏళ్ల స్విమ్మర్ తన హీట్స్‌లో నాలుగో స్థానంలో నిలిచాడు. మెడల్ ఈవెంట్ కోసం జరిగే ఫైనల్స్‌లో అతను ఏడో స్థానంలో నిలిచాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ పీటర్ కోట్జ్ 53.67 సెకన్లతో సెమీస్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో నటరాజ్ తన ఈవెంట్‌లో 27వ స్థానంలో నిలిచాడు.
ఇదిలా ఉంటే.. నిన్న.. కామన్వెల్త్ గేమ్స్ లో టీమిండియా అమ్మాయిలు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నారు. 155 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఓ దశలో 49 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకోగా, పట్టుబిగించాల్సిన టీమిండియా ఉదాసీనంగా వ్యవహరించింది. ఆపై, అందుకు తగిన మూల్యం చెల్లించింది. టీమిండియా పట్టుసడలించడంతో ఆసీస్ రెచ్చిపోయింది. దాంతో ఆ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి విజయవంతంగా లక్ష్యఛేదన పూర్తిచేసింది.