టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఐదో టెస్ట్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇవాళ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా… తొందరగానే ఆల్ అవుట్ అయింది. కేవలం 157 పరుగులు చేసిన టీమిండియా… ఆస్ట్రేలియాకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది.
39.5 ఓవర్లు ఆడింది టీం ఇండియా. దీంతో రెండో ఇన్నింగ్స్ లో 157 పరుగులకు అలౌట్ కావడం జరిగింది. నిన్న రాత్రి 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా ఇవాళ ఉదయం 4 వికెట్లు సమర్పించుకుంది. ఇక టీమ్ ఇండియా ఆల్ అవుట్ కావడంతో ఆస్ట్రేలియా కూడా బ్యాటింగ్ కు దిగింది. బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా ఇప్పటికే మూడు వికెట్లు కోల్పోవడం జరిగింది. పది ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా…
మూడు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. మరో 104 పరుగులు చేస్తే టీమిండియా పైన మరో విజయాన్ని ఆస్ట్రేలియన్ నమోదు చేసుకునే ఛాన్స్ ఉంది.