జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిలో ముఖ్యంగా రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు జనవరి 26, 2025 నుంచి అమలవుతాయని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ, ఫిబ్రవరి నుంచి లబ్దిదారులకు రేషన్ బియ్యం, 200 కొత్త గ్రామపంచాయతీలు, 11 నూతన మండలాలకు ఆమోదం, పెండింగ్ లో ఉన్న ములుగు మున్సిపాలిటీ ఏర్పాటు.. త్వరలోనే గవర్నర్ కు ప్రతిపాదనలు, వివిధ శాఖల్లో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేబినెట్.

CM Revanth Reddy

రాళ్లు, రప్పలు, గుట్టలు, రోడ్లు, మైనింగ్, రియల్ ఎస్టేట్ వెంచర్లు, పరిశ్రమల భూములు, రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములకు రైతు భరోసా వర్తింపజేయమని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వ్యవసాయం చేసే భూమి ఎంత ఉన్నా ఈ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. అలాగే భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు కూడా రైతు భరోసా ఇస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద వారికి ఏటా రూ.12,000 సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news