పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి : బండి సంజయ్ ఫైర్

కిషన్ రెడ్డి ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ ప్లాన్ ప్రకారం దాడి చేసిందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం డైరెక్షన్ లోనే ఈ దాడి జరిగిందని అన్నారు. శాంతి భద్రత ల సమస్యలు సృష్టించి ఎన్నిక వాయిదా వేయాలని కుట్ర చేస్తున్నారంటూ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడులు చేయడమే మీ పద్దతా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ను జోకర్ గా చూస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bandi Sanjay Kumar | బండి సంజ‌య్
Bandi Sanjay Kumar | బండి సంజ‌య్

శాంతి భద్రత ల సమస్యలు తేవాలని చూస్తున్నారని…ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ దాడులు అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. కిషన్ రెడ్డి ప్రచారంలో టిఆర్ఎస్ కార్యకర్త ఎస్ఐ కాలర్ పట్టుకున్నారని ఎస్ఐ ని నెట్టాడు అని బండి సంజయ్ ఆరోపించారు. దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయలేదని…కేంద్ర మంత్రి పై దాడి పట్ల ఎలక్షన్ కమిషన్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థ ని ప్రక్షాళన చేయాలని…సీఎం క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. దాడులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతామని బండి సంజయ్ హెచ్చరించారు.