T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

-

టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరికాసేపట్లో భారత్-అఫ్గానిస్థాన్ తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.మ్యాచ్‌ స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10:30 గంటలకు అంటే భార‌త కాల‌మానం ప్ర‌కారం రాత్రి 8 గంట‌లకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ బార్బడోస్లోని కెన్సింగ్టన్ ఓవల్లో జరుగుతుంది.

అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.సూప‌ర్ 8 మ్యాచ్‌ల‌కు రిజ‌ర్వ్ డే లేకపోవడంతో వ‌ర్షం కార‌ణంగా అఫ్గానిస్తాన్‌, భార‌త్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ర‌ద్దు అయితే.. ఇరు జ‌ట్ల‌కు ఒక్కొ పాయింట్‌ను కేటాయిస్తారు. ఇదే జ‌రిగితే.. టీమ్ఇండియా సెమీ ఫైన‌ల్ అవ‌కాశాలు ప్ర‌భావితం అవుతాయి. ఎందుకంటే సూప‌ర్ 8లో ఇండియా మూడు మ్యాచులు ఆడ‌నుంది. క‌నీసం 2 మ్యాచుల్లో విజ‌యం సాధిస్తేనే సెమీఫైన‌ల్‌కు వెళ్తుంది.

 

ఇండియా ప్లేయింగ్ ఎలెవన్ : రోహిత్ శర్మ, కోహ్లి, పంత్, సూర్య కుమార్, దూబే, పాండ్య, జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్, అర్ష్దీప్, బుమ్రా.

 

అఫ్గానిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్ : గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బదిన్, నబీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్

Read more RELATED
Recommended to you

Latest news