బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాప్సీ పన్నూ, స్వరా భాస్కర్‌లను బీ గ్రేడ్ నటీనటులని విమర్శించింది. అయితే తాజాగా ఈ విమర్శలపై తాప్సీ ఘాటుగా స్పందించింది. కొందరు పరిశ్రమ గురించి ఎప్పుడు వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని, ప్రస్తుతం సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టే నటీనటుల తల్లిదండ్రులకు గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ పరోక్షంగా కంగనా పై తాప్సీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
అలాగే బాలీవుడ్ నిర్మాత కరన్‌జోహార్‌ను తానెప్పుడు అభిమానిస్తానని గానీ, ద్వేషిస్తానని చెప్పలేదని తెలిపింది. కానీ మీరు నిరంతరం ఓ వ్యక్తిని విమర్శిస్తున్నారంటే సదరు వ్యక్తిని అభిమానిస్తారని కంగనాను తాప్సీ కౌంటర్ ఇచ్చింది.