సిర్పూర్-కాగజ్‌నగర్‌లో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. 26 సంవత్సరాల యువకుడు- తిరుపతి ఆరోగ్యంగా వ్యవసాయం చేసుకుంటూ,తండ్రికి సహకరిస్తూ తన భార్య పిల్లలను పోషించుకుంటూ జీవనం గడుపుతున్నాడు.అకస్మాత్తుగా అర్థరాత్రి అతనికి కడుపునొప్పి రావడంతో స్థానిక RMP సూచన మేరకు కుటుంబసభ్యులు కాగజ్ నగర్‌లోని షణ్ముక మల్టి స్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకొచ్చారు.
టెస్టులు,స్కానింగ్ చేస్తున్నామని చెబుతూ,స్పెషలిస్ట్ డాక్టర్‌ని పిలిపిస్తున్నామని చెప్పి రాత్రికి రాత్రే 25 వేల రూపాయలు కట్టించుకున్నట్లు తెలిసింది. తీరా చూస్తే యువకుడు విగతజీవిగా మారాడు. కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆపరేషన్ వికటించిన తరువాత డాక్టర్లు మృతుడి కాళ్లు పట్టుకున్నట్లు సమాచారం.మృతుడు అపెండిసైటిస్ బాధతో ఆసుపత్రికి రాగా. వైద్యులు గుర్తించడంలోవిఫలం కావడంతో యువకుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే షణ్ముక హాస్పిటల్‌పై హాస్పిటల్స్ పై విజిలెన్స్ అధికారులతో విచారణ జరపించాలని బీఆర్ఎస్ నేత, మాజీఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.