మంచి నిద్ర కోసం వీటిని తీసుకోండి….!

-

నిద్ర పోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర రావట్లేదా…? అయితే నిద్రపోయే ముందు వీటిని తీసుకోండి. దీనితో మీరు చక్కగా నిద్ర పోవచ్చు. మరి ఆలస్యమెందుకు పూర్తి వివరాలు ఇప్పుడే చూసేయండి…

రాత్రి నిద్రపోయే ముందు తీసుకోవాల్సినవి:

బాదం :

రాత్రిపూట నిద్ర పోయే ముందు రోస్ట్ చేసిన బాదం ని తీసుకోండి. బాదం ను తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు తినడం వల్ల టైప్2 డయాబెటిస్ వంటివి చేరవు. అలానే ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో మెగ్నీషియం కలిగి ఉండడం వల్ల మంచి నిద్ర వస్తుంది. దీనిలో ఉండే మెలటోనిన్ మంచి నిద్రకు సహాయ పడుతుంది.

కివి:

కివి లో సెరటోనిన్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటి మూలానా నిద్ర బాగా పడుతుంది. కాబట్టి రోజూ పడుకునే ముందు కివి తీసుకోవడం చాలా మంచిది.

వాల్ నట్స్:

వాల్ నట్స్ లోని కొన్ని ప్రాపర్టీస్ మంచి నిద్ర పట్టడానికి దోహదపడతాయి. మెలటోనిన్ మరియు హెల్ది ఫ్యాట్స్ దీనిలో ఉండడం వల్ల బాగా నిద్ర పడుతుంది.

అన్నం:

అన్నం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది. అన్నం లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ కారణంగా మంచి నిద్ర పడుతుంది. పాలు పెరుగు వంటివి తీసుకోవడం వల్ల కూడా మంచి నిద్ర పడుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version