నోటి పూత తో బాధ పడుతున్నారా..? అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి చాలా మంది నోటి పూత వలన రకరకాలుగా బాధ పడుతూ ఉంటారు మీకు కూడా నోటి లో పూత కలిగినట్లయితే కచ్చితంగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోండి. మౌత్ అల్సర్స్ వల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏమీ కూడా తిన లేక బాధ పడాల్సి ఉంటుంది. నోటి పూత సాధారణంగా పసుపు లేదా తెలుపు రంగు లో ఉంటుంది. అలానే ఎర్రగా వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు కారంగా ఉండే ఆహార పదార్థాలను కానీ లేదంటే కొంచెం మసాలా ఉండే వాటిని తింటే మండుతుంది.
అయితే నోటి పూత అనేది సాధారణంగా ఎసిడిక్ లేదా స్పైసి ఫుడ్ ఫుడ్ కలిగినవి తీసుకోవడం వలన కలుగుతుంది. ఇది పది రోజుల్లో తగ్గిపోవచ్చు. పసుపు తో నోటి పూత సమస్య నుండి బయట పడొచ్చు పసుపుని పాలల్లో వేసుకుని కానీ నీళ్లలో వేసుకుని కానీ తీసుకుంటే నోటి పూత నుండి త్వరగా బయటపడొచ్చు.
టమాటా ని కూడా మీరు తీసుకుని నోటి పూత సమస్య నుండి బయటపడుచ్చు. టమాట ని మీరు జ్యూస్ గా కానీ లేదంటే సలాడ్ గా కానీ తీసుకో వచ్చు ఇలా నోటి పూత సమస్య నుండి బయట పడొచ్చు. బట్టర్ మిల్క్ ని తీసుకోవడం లేదంటే బట్టర్ మిల్క్ తో నోటి ని పుక్కిలించడం వలన కూడా నోటి పూత సమస్య ఉండదు. వెల్లుల్లి లో చక్కటి గుణాలు ఉంటాయి వెల్లుల్లిని తీసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు వెల్లుల్లి నొప్పి నుండి కూడా బయటపడిస్తుంది. నోటి పూత సమస్య నుండి కూడా వెల్లుల్లితో బయటపడొచ్చు.