బండి-ఈటల క్లాష్..కమలంలో కాంగ్రెస్.!

-

మొన్నటివరకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలిసిందే. అంతర్గత పోరు అనడం కంటే బహిరంగ పోరు అని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే ఒకరినొకరు తిట్టుకుంటారు. అయితే ఇటీవల అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో పోరు తగ్గింది. పోరు లేదని చెప్పలేం గాని..నేతలు కాస్త సఖ్యతతో ఉంటున్నారు. ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు.

అయితే బి‌జే‌పిలో సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు బి‌జే‌పి నేతలంతా కలిసికట్టుగా పనిచేసి బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయాలని పనిచేస్తూ వచ్చారు. కానీ కర్నాటక ఎన్నికల్లో ఓడిపోవడం బి‌జే‌పికి మైనస్ అయింది. ఆ ప్రభావం తెలంగాణపై పడింది. పైగా ఇతర పార్టీల నుంచి వలసలు వస్తేనే బి‌జే‌పి బలపడుతుంది. కానీ అలా జరగడం లేదు. ఇదే సమయంలో బి‌జే‌పిలో ఆధిపత్య పోరు పెరుగుతుంది. అనూహ్యంగా కీలక నేతల మధ్య రచ్చ మొదలైంది. ఎప్పటినుంచో బండి సంజయ్, ఈటల రాజేందర్‌లకు పడటం లేదని కథనాలు వస్తున్నాయి.

ఆ కథనాల్లో ఎంతవరకు నిజముందో క్లారిటీ లేదు. కానీ ఇటీవల కొన్ని పరిణామాలతో అది నిజమే అనే పరిస్తితి. ఎప్పుడైతే ఈటల రాజేందర్ చేరికల కమిటీ ఛైర్మన్ గా ఉంటూ..పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావులని బి‌జే‌పిలోకి తీసుకురావడానికి భేటీ అవ్వడం, ఆ భేటీ గురించి తనకు తెలియదని బండి చెప్పడంతో రచ్చ మొదలైంది.

అలా మొదలైన రచ్చ..తాజాగా అధ్యక్షుడుగా బండి సంజయ్‌ని  తప్పిస్తున్నారనే ప్రచారం వరకు పార్టీలో అంతర్గత పోరు ఉందని అర్ధమైంది. ఢిల్లీకి వెళ్ళి ఈటల..అక్కడ నుంచి బండి పదవి తొలగిస్తున్నారని ప్రచారం చేయిస్తున్నారని బండి వర్గం మండిపడుతుంది. అలాగే ఈటలకు ఎన్నికల కమిటీ ఛైర్మన్ పదవి ఇస్తున్నారని ప్రచారం వక్కింది. ఇవన్నీ ఈటల చేయిస్తున్నారని బండి వర్గం గుర్రుగా ఉంది. ఇక ఈటల చేరికలు పెంచడంలో ఫెయిల్ అయ్యారని. కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్‌ల నుంచి నేతలని తీసుకు రాలేకపోయారని బండి వర్గం అంటుంది. ఇలా ఇరు వర్గాల మధ్య రచ్చ నడుస్తుంది. ఇదే సమయంలో ఈటల రాజేందర్ తో పాటు కొందరు నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తారని బండి వర్గం ప్రచారం చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. మొత్తానికి ఈటల, బండిల మధ్య పోరు గట్టిగానే ఉన్నట్లు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news