తలవీ ట్రైలర్‌..అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న లింక్ ఇదేనా

-

తమిళ ప్రజల గుండెల్లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు జయలలిత. సినీ రంగుల ప్రపంచాన్ని వదలి రాజకీయాల్లోకి వచ్చిన జయ ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. తలైవిగా ప్రజల మన్ననలు అందుకున్న జయలలిత… రాజకీయాల్లోకి వచ్చాక ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కున్నారు. ప్రజా పక్షాన నిలిచి అమ్మగా పిలిపించుకున్నారు. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నదే తలైవీ. ఈ సారి ఎన్నికలకు తలైవీ లేకపోయినా..ఆమె బయోపిక్‌ వస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకూ-ట్రైలర్‌కూ ఉన్న లింక్ పైనే తమిళనాట హాట్ హాట్ గా చర్చ నడుస్తుంది.

తమిళనాట నటిగా, ముఖ్యమంత్రిగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు జయలలిత. ప్రజలు ప్రేమగా ఆమెను తలైవీ అని పిలుచుకున్నారు రాజకీయాల్లోకి వచ్చాక అమ్మగా ఆరాధించారు. అయితే, సినిమా రిలీజ్‌ ఆలస్యమౌతున్నా..ట్రైలర్ని వదిలి ఆకట్టుకుంది యూనిట్‌. తలైవీ బయోపిక్‌లో జయ పాత్రను కంగనా రనౌత్‌ పోషిస్తున్నారు. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే తమిళనాట ప్రచారం ప్రారంభించేశాయి రాజకీయ పార్టీలు. నియోజకవర్గాల్లోని పరిస్థితులు… ఓటర్ల సామాజిక స్థితి గతులు, కుల సమీకరణలు వంటి విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.

ఇదంతా ఒకెత్తయితేఇప్పుడు బయోపిక్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు ముఖ్య నేతల బయోపిక్‌లతో పరోక్షంగా ప్రచారం చేసుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో రెండు బయోపిక్‌లు వచ్చాయి. అందులో ఒకటి పీఎం నరేంద్ర మోడీ కాగా, రెండోది మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పై తీసిన ది యాక్సిడెంటల్‌ ప్రైమినిస్టర్‌. నరేంద్ర మోడీ చిన్న తనంలో పేదరికాన్ని అనుభవించియువ్వనంలో సన్యాసి జీవితాన్ని గడపడం దగ్గర నుంచి అనేక అంశాల ప్రస్తావన ఈ సినిమాలో ఉంది.
గుజరాత్‌ సీఎంగా పని చేయడం తర్వాత..దేశ ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టే వరకూ సినిమా సాగుతుంది.

2019 జనవరిలో ది యాక్సిడెంటల్‌ ప్రైమినిస్టర్‌ రిలీజైంది. సంజయ్‌ బారు రాసిన పుస్తకం ఆధారంగా… అదే పేరుతో ఈ సినిమా తీశారు. 2004 నుంచి 2014 వరకూ పదేళ్లలో ప్రధానిగా మన్మోహన్‌ సింగ్‌కు ఎదురైన ఇబ్బందుల్ని ఈ సినిమాలో చూపించారు. తొలి ఐదేళ్లలో మన్మోహన్‌ నిర్ణయాలను కాంగ్రెస్‌ పార్టీ ఎలా వ్యతిరేకించిందో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీ వారసత్వ రాజకీయాలకు మన్మోహన్‌ సింగ్‌ ఎలా బలయ్యారో చెప్పే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా మన్మోహన్‌ సింగ్‌ను ఏ విధంగా రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ లెక్క చేయకుండా ప్రవర్తించారనే అంశాలను చూపించే ప్రయత్నం జరిగింది.

అయితే ది యాక్సిడెంటల్‌ ప్రైమినిస్టర్‌ గాని, పీఎం మోడీ సినిమా గానీ కలెక్షన్ల కోసం తీసిన సినిమాలు కాదు. సరిగ్గా ఎన్నికల సమయంలో వీటి రిలీజ్‌ కూడా యాదృచ్ఛికం కాదు. గతాన్ని ఓ సారి గుర్తు చేయడం ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడమే వీటి లక్ష్యం. ఇప్పుడు తలైవీ కూడా దీనికి మినహాయింపు కాదు.

Read more RELATED
Recommended to you

Latest news