మరోసారి బాయ్‌ఫ్రెండ్‌తో తమన్నా.. ఫోటోలు వైరల్

-

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రేమ వ్యవహారం మరోసారి బయటపడింది. తాజాగా ముంబైలో జరిగిన ఓ ఈవెంట్ లో తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి మిల్క్ బ్యూటీ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ తార తమన్నా భాటియా ఈ మధ్య జంటగా కనిపించి ఆశ్చర్యపరుస్తోంది. విజయ్ వర్మ, తమన్నా భాటియా మరోసారి ముంబైలోని బాంద్రా ప్రాంతంలో కెమెరా కంట్లో పడ్డారు. గోవాలో జరిగిన నూతన సంవత్సరం వేడుకల పార్టీలో వీరు తళుక్కుమనడం అభిమానులకు గుర్తుండే ఉంటుంది.

దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో, వీరిద్దరు సహజీవనంలో ఉన్నారనే అభిప్రాయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరూ కలసి కనిపించడం అనుమానాలను బలపరిచేలా ఉంది. తమన్నా మోకాలి పైకి ధరించిన సింగిల్ స్కర్ట్ తో కనిపించింది. విజయ్ బ్లూరంగు హుడీలో కనిపించాడు. దీనికి ఒక రోజు ముందు అవార్డుల కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. గోవాలో జరిగిన న్యూఇయర్ పార్టీలో తమన్నా, విజయ్ ముద్దులు పెట్టుకుంటూ, కౌగిలింతలతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.అనంతరం గోవా నుంచి ముంబైకి కలిసే తిరిగొచ్చారు. వీరి బంధం వివాహ బంధంగా మారుతుందా? అన్నది చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version