తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఎఐఎడిఎంకె పరాజయం పాలవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె పళనిస్వామి సోమవారం రాజీనామా చేశారు. పళనిస్వామి తన కార్యదర్శి ద్వారా సేలం నుండి రాజీనామా పంపారు. ఈ లేఖ మధ్యాహ్నం 1 గంటకు గవర్నర్‌కు చేరుతుంది అని తమిళ మీడియా పేర్కొంది. గవర్నర్ కార్యాలయం దీనిపై ఇంకా స్పందించలేదు అని తమిళ మీడియా పేర్కొంది.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె 125 సీట్లు గెలుచుకోగా, ఓ పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నేతృత్వంలోని ఎఐఎడిఎంకె 65 సీట్లు గెలుచుకున్నాయి. స్టాలిన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిఎంకె ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయన శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. నిన్న తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే.