తమిళనాడు రాష్ట్రంలో.. నిన్న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో… సిడిఎస్ బిపిన్ రావత్ దంపతులతో సహా మొత్తం 13 మంది మరణించిన సంగతి తెలిసిందే. కేవలం జవాన్ వరుణ్ మినహా ఆ విమానంలో ప్రయాణించిన అందరూ మరణించారు. అయితే హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం పాలైన 13 మంది జవానులకు తమిళనాడు ప్రజలు ఘన నివాళి అర్పించారు.
సూలూరు ఎయిర్ బేస్.. నుంచి అంబులెన్స్ లో భౌతికకాయాన్ని తీసుకు వెళుతుండగా దారిపొడవునా నిలబడి… పూల వర్షం కురిపించారు తమిళనాడు ప్రజలు. అంతే కాదు “భారత్ మాతాకీ జై” అంటూ నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు ప్రజలు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాదా వారి పార్ధివదేహాన్ని ఎయిర్ ఫోర్స్ సూపర్ హెర్క్యులస్ ట్రాన్స్ పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ లో సూలురు నుంచి ఢిల్లీ తరలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. జవాన్ వరుణ్ ను బెంగుళూరు ఆస్పత్రికి తరలించారు ఆర్మీ అధికారులు.
#WATCH| Tamil Nadu: Locals shower flower petals & chant 'Bharat Mata ki Jai' as ambulances carrying mortal remains of CDS Gen Rawat, his wife & other personnel who died in Coonoor military chopper crash, arrive at Sulur airbase from Madras Regimental Centre in Nilgiris district pic.twitter.com/fhVIDaf5FL
— ANI (@ANI) December 9, 2021