కార్తీకదీపం ఎపిసోడ్ 1218: పులిబోనులో తలపెట్టిన దీప…కథలో ఎంట్రీ ఇచ్చిన మోనితను మించిన విలన్ రుద్రాణి

-

కార్తీకదీపం ఈరోజు ఎపిసోడ్ లో సౌందర్య, ఆనంద్ రావు ఏడుస్తూ ఉంటారు.కార్తీక్ వాళ్లు ఏదో ఊర్లో నడుచుకుంటూ వెళ్తుంటారు. తాడికొండ గ్రామంలోకి ఎంట్రీ ఇస్తారు. పిల్లలు ఏం అర్థంకాదు..నడుచుకుంటూ ఎందుకు వెళ్తున్నాం, మనతో లగేజ్ ఎందుకు లేదు, ఏ రిసార్ట్ కి వెళ్తున్నాం, మనతో సెల్ ఫోన్ ఎందుకు లేదు అని శౌర్య అడుగుతుంది. మనం హాలిడే ట్రిప్ కి వచ్చాం, మనం ఎక్కడున్నామో ఎవరికి తెలియకూడదు..నా ఒక్క దాని దగ్గరే ఫోన్ ఉంది. అది కూడా కొత్త నంబరే..ఎవరికి ఫోన్ చేయొద్దు..ఎవరి దగ్గరనుంచి ఫోన్లు రావు అంటుంది. హిమ ఏంటో..నడుచుకుంటూ రావటం అంటే..కార్తీక్ కాళ్లు నొప్పలు చేస్తున్నాయా అమ్మా..ఎత్తుకోనా అంటాడు. దీప నడక మంచిది..పిల్లలకు కష్టం, సుఖం అలవాటు చేయాలి..ఇప్పుివరకూ వాళ్లను గారాబాం చేసింది చాలు అంటుంది. హిమ మాత్రం రిసార్ట్ ఇలా ఉండాలి, సూర్యకిరణాలు రావాలి..రాత్రి వెన్నెల పడాలి అంటూ చెప్తుంది.

karthika-deepam

ఇక్కడ శ్రావ్య సౌందర్య, ఆనంద్ రావుకు కాఫీ ఇచ్చి..తినండి అత్తయ్య మీరు ఏం తినలేదు అంటుంది. ఆదిత్య ఇప్పుడు ఇవి అవసరమా అంటే..మనం అంటే తట్టుకోగలుగుతాం…వాళ్లు అలాకాదు కదా అంటుంది శ్రావ్య్. ఆదిత్య నేను అన్నయ్య వాళ్లను వెతకడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నాను అంటూ మాట్లాడతాడు..ఇంతలో మోనిత వస్తుంది. మోనిత పిల్లాడితో వచ్చి ఏదేదో వాగేసి..కార్తీక్ అని పిలుస్తుంది. పాపం వీళ్ల బాధ..అసలే కొడుకు ఎటు పోయాడో తెలియక ఏడుస్తుంటే..ఈ మోనిత వచ్చి చెత్తవాగుడు. కార్తీక్ అని మోనిత అరుస్తుంటే..శ్రావ్య బావగారు లేరు మోనిత అంటుంది. ఎక్కడికి వెళ్లాడు..ఇంతపొద్దున్నే అని మోనిత అంటే.. ఆదిత్య నీ పుణ్యమా అని..ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయాడు, అవమానాలు చేసి చంపుకుతిన్నావు కదా అంటుంది. ఈ ఐడియా బానే ఉంది కదా..మీరే కార్తీక్ ను పంపించి కథలు చెప్తున్నారా, ఎవరికి వచ్చింది ఆదిత్య నేకేనా అంటే..సౌందర్య ఏడుస్తూ..నీకు దన్నం పెడతాను..ఇక్కడినుంచి వెళ్లిపో అంటుంది. మోనిత మనసులో వీళ్లు అందరు ఏడుస్తున్నారంటే..నిజమేనా..లేక అద్భుతమైన నాటకమా అనుకుని..మరి మీ కొడుకు పెళ్లాం పిల్లలతో వెళ్లిపోతే..నా కొడుకు పరిస్థితి ఏంటి అంటుంది మోనిత.

ఆనంద్ రావు ఏడుస్తూ..ఏంటమ్మా నువ్వు..కార్తీక్ వెళ్లిపోయిన బాధలో మేము ఉంటే..అంటాడు. మోనిత మీది కడుపుకోత అయితే..నాది గుండె కోత నా బాధ ఎ‌వరు చూశారు. ఇప్పుడు ఈ బిడ్డకు ఏం న్యాయం చేస్తారు, వీడు నాన్న ఏడి అంటే నేనేం చెప్పాలి అంటూ మాట్లాడుతుంది. ఆదిత్య నువ్వు అసలు మనిషివేనా, ఏం మాట్లాడుతున్నావ్, అన్నయ్య వాళ్లు పిల్లలు వెళ్లిపోతే నువ్వేంటి గెట్ ఔట్ అంటాడు. సౌందర్య..మోనిత నువ్వు తెలిసి వచ్చావో తెలియక వచ్చావో తెలియదు.నీకు ఈ ఇంటికి ఏం సంబంధం లేదు..ఆదిత్య అసలే కోపంలో ఉన్నాడు..వాడు కోపంలో ఏం చేసినా మాకు సంబంధంలేదు..వెళ్లిపో ఇక్కడినుంచి అంటుంది.

మోనిత నాకు ఈ ఇంటికి సంబంధంలేదా..పేగు మెడలో వేసుకుని పుట్టినప్పుడు వీడు మీ మనవడా..దోష నివారణ పూజ చేశాక ఏం సంబంధం లేదా..క్షణానికో మాట మాట్లాడతారా..అని ఏదో ఒకటి వాగేసి వెళ్లిపోతుంది. సౌందర్య కార్తీక్ ఎక్కడున్నావ్ రా, ఎలా ఉన్నావ్, ఏం తింటున్నావ్ రా అని ఏడుస్తుంది. కార్తీక్ వాళ్లు ఏదో పాడుపడ్డ ఇంటి దగ్గర ఉంటారు. పిల్లలు ఏంటి డాడీ ఇక్కడకు వచ్చాం మనం అంటే..దీప కాసేపు మాట్లాడకుండా ఉంటారా, మీ నాన్నను డిస్టబ్ చేయొద్దు సరేనా అంటుంది.

వీళ్లను ఇంటి పక్కన ఆవిడ చూసి ఎవరండి మీరు అంటుంది. దీప వెళ్తుంది. పని వెతుక్కుంటూ వచ్చాం అంటుంది. పని సంగతి దేవుడెరుగు, ముందు మీరు ఆ ఇంటినుంచి వెళ్లిపోండి అంటుంది. ఆ ఇళ్లు ఎ‌వరిదో మీకు తెలియక వచ్చినట్లు ఉన్నారు,..ఆవిడ వచ్చిందంటే అంతే అంటుంది. ఎవరావిడ అని దీప అంటే..రుద్రాణి..రాక్షసి, ఇక్కడ ఎక్కువ సేపు ఉండటం మంచిది కాదు వెళ్లిపోండి అంటుంది. కాళీగానే ఉంది కదా ఆ ఇల్లు అని దీప అంటే..మీరెంటమ్మా కాళీగా ఉంటే ఉంటారా, కత్తితీసకుని మన చేయి మనమే నరుకుంటారా వెళ్లిపోండి అంటుంది. ఆవిడ అంత మంచిగా చెప్పింది కదా..దీపమాత్రం కార్తీక్ తో ఏంలేదు..కొత్తగా వచ్చాం కదా వివరాలు అడుగుతుంది అంతే అంటుంది. పిల్లలతో మనం ఈ ఇంటిని శుభ్రం చేయాలి ..ఈరోజు నుంచి నాకు పనుల్లో ఎవరు ఎక్కువ సాయం చేస్తారో, ఎవరు తక్కువ ప్రశ్నలు అడుగుతారో వారికి మార్కులు ఇచ్చి..గిఫ్ట్ లు, చాక్లెట్లు ఇస్తాం అంటుంది. మీకు మార్కులు మీ నాన్న సీక్రెట్ గా వేస్తారు అంటుంది దీప. దీప వైపు కార్తీక్ దీనంగా చూస్తాడు ఎపిసోడ్ అయిపోతుంది.

తరువాయిభాగంలో దీప తిన్నగా ఆ రుద్రాణి ఇంటికే వెళ్తుంది. ఆ రుద్రాణి ఇళ్లు, గెటప్ అంతా విలనిజం మాదిరి ఉంటుంది. నా పేరు దీప, ఈ ఊరికి కొత్తగా వచ్చాం, అక్కడున్న కాళీ ఇంట్లో అని చెప్పబోతుంది. నా గురించి తెలిసే వచ్చావా అంటుంద ఆ రుద్రాణి. ఏంటో ఈ సీరియల్ ఇలా తయారు చేశాడు. డాక్టర్ బాబు ఆస్తి అంతా ఇవ్వకపోతే..సగం ఇవ్వవొచ్చుగా..పైసా కూడా ఉంచుకోకుండా ఇచ్చి ఇలా బికారిలా మారటం ఏంటో..ప్రేక్షకులకు ఈ సీరియల్ మీద ఆసక్తి రోజు రోజుకు తగ్గిపోతుంది. ఆపండిరాబాబు అని మొత్తుకుంటున్నారు. అయినా డైరెక్టర్ మాత్రం అంతకు అంత ఘోరంగా డాక్టర్ బాబును పాతాళానికి నెడుతున్నాడు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news