పిల్లలకు వ్యాక్సిన్ అందించే మొదటి రాష్ట్రంగా తమిళనాడు…!

దేశంలో పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. అందుకే భారత్ బయోటెక్ తయారీ కోవాగ్జిన్ టీకాకు అనుమతులను కూడా ఇచ్చింది. దీంతో 2-18 ఏళ్లలోపు పిల్లలకు రానున్న కాలంలో కోవాగ్జిన్ టీకాను ఇవ్వనున్నారు. అయితే తాజాగా కేంద్రం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాత నిపుణుల అభిప్రాయం కోసం ప్రతిపాదనలు పంపింది. ప్రతిపాదనలు ఆమోదం పొందితే టీకా అందించే మొదటి రాష్ట్రంగా తమిళనాడు మారుతుందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం అన్నారు. కొన్ని షరతులతో 2-18 ఏళ్ల పిల్లకు కోవాగ్జిన్ టీకా ఇచ్చేందుకు అత్యవసర అనుమతులను సెంట్రల్ డ్రగ్ అథారిటీ సిఫారసులు చేసింది.

 దీంతో భారత్ బయోటెక్ సంస్థ ఇందుకు అనుగుణంగా టీకా తయారీని కూడా ప్రారంభించింది. ఇప్పటికే 12-18 ఏళ్ల వారికి జైకోవ్-డీ వ్యాక్సిన్ తయారవుతోంది. జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ తయారు చేస్తోంది. ప్రపంచంతో తొలి డీఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్గా జైకోవ్-డీ రికార్డ్ స్రుష్టించింది. పిల్లలకు అందించే వ్యాక్సిన్లతో జైకోవ్-డీ తరువాత రెండో వ్యాక్సిన్గా కోవాగ్జిన్ అందుబాటులోకి రానుంది.