శ్రీవారిని దర్శించుకున్న పెళ్లి సందD టీం

తిరుమ ల శ్రీవారిని పెళ్లి సందD చిత్ర యూనిట్ దర్శించుకుంది. పెళ్లి సందడి సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో ఇవాళ శ్రీ వారిని దర్శించు కుంది పెళ్లి సందడి చిత్ర బృందం.. ఈ సందరర్భంగా ఈ సినిమా హీరో రోషన్‌ మాట్లాడుతూ….తిరుమల శ్రీ వారిని దర్శించు కోవడం చాలా సంతోషం గా ఉందన్నారు. సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం తిరుమల వచ్చాముని… తమ సినిమా మంచి విజయం సాధించాలని నేపథ్యంలోనే వచ్చామని తెలిపారు.

సినిమా హీరోయిన్ శ్రీలేఖ మాట్లాడుతూ.. మంచి ఫ్యామిలీ ఎంట టైనర్ సినిమా తీసామని..‌. కుటుంబ సభ్యులందరు చూడదగిన పెళ్లిసందడి అని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ లు పెట్టుకుని.. థియేటర్లలో మాత్ర మే సినిమా చూడాలని ఆమె కోరారు. కాగా.. సీనియర్‌ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో హీరో శ్రీ కాంత్‌ కొడుకు రోషన్‌ మరియు శ్రీ లేఖ హీరో హీరోయిన్లు గా ఈ సినిమా చేసిన సంగతి తెలిసిందే. పెళ్లి సందD రేపు విడుదల కానుంది.