విద్యాబుద్ధులు చెబుతూ నలుగురికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రొఫెసరే దారి తప్పాడు. స్టూడెంట్ పై కన్నేసిన ప్రొఫెసర్ తన కోరిక తీర్చాలంటూ.. వేధింపులకు పాల్పడ్డాడు. కొన్నాళ్ల పాటు వేధింపులను మౌనంగా పాటించిన సదరు విద్యార్థిని విషయాన్ని కాలేజ్ యాజమాన్యానికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతం తమిళనాడు కన్యాకుమారి జిల్లాలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కన్యాకుమారికి చెందిన ఓ విద్యార్థిని స్థానికంగా ఉండే కళాశాలతో చదువుకుంటోంది. అయితే అదే కాలేజ్ లో ప్రొఫెసర్ గా పనిచేసే వాసుదేవన్ సదరు విద్యార్థినిపై కన్నేశాడు. విద్యార్థిని ఫోన్ నెంబర్ సంపాదించి రోజూ అసభ్యకర మెసేజ్ లు, వీడియోలు పంపుతూ వేధించే వాడు. తన కోరిక తీర్చాలంటూ విద్యార్థినిని మానసికంగా, శారీరకంగా వేధించాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడిన బాధితురాలు విషయాన్ని తన సోదరుడికి చెప్పింది.
అనంతరం సోదరుడు కళాశాలకు వెళ్లి సదరు ప్రొఫెసర్ ను నిలదీయగా.. బాధితులపైనే దాడికి తెగబడ్డాడు. చివరకు యువతి సోదరుడితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటకు రావడంతో కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్ ని సస్పెండ్ చేసింది.