నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు..! : గవర్నర్ తమిళిసై

-

తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వైఖరి నడుస్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో తన ఫోన్ ట్యాప్ అవుతుందనే అనుమానం ఉందని గవర్నర్ తమిళిసై ఆరోపించారు. తద్వారా ప్రైవసీకి భంగం కలుగుతోందని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అప్రజాస్వామిక విధానం అమలవుతోందనే అనుమానం ఉందని గవర్నర్ అన్నారు. ప్రజా సమస్యల విషయంలో తాను సానుకూలంగా స్పందిస్తానని వెల్లడించారు. ఫాంహౌస్‌ కేసులోనూ తనను లాగే ప్రయత్నం చేశారరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మాజీ ఏడీసీ తుషార్‌ను ఈ కేసులోకి తీసుకువచ్చిన కారణం అదేనని తమిళిసై సౌందర రాజన్ విమర్శించారు .

“నేను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాననడం ఆశ్చర్యకరంగా ఉంది. నా పర్యటనల గురించి ప్రభుత్వానికి సమాధానం ఇస్తున్నాను. ప్రొటోకాల్ పాటించని కలెక్టర్, ఎస్పీలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు. రాజ్‌భవన్ ప్రతిష్ఠను తగ్గించాలని చూస్తున్నారు.రాజ్‌భవన్ ముందు ధర్నా చేస్తారని విద్యార్థుల ఐకాస పేరిట వార్తలు వస్తున్నాయి. రాజ్‌భవన్ తలుపులు ఎప్పటికీ తెరిచే ఉంటాయి. బాసర విద్యార్థులు వచ్చారు.. మిగతా విద్యార్థులు వచ్చారు. రాజ్‌భవన్ తలుపులు తెరుచుకుని ఉంటాయి, ప్రగతిభవన్ మాదిరి కాదు. ప్రజా సమస్యల విషయంలో సానుకూలంగా స్పందిస్తాను.” – తమిళిసై సౌందర రాజన్ , గవర్నర్‌

Read more RELATED
Recommended to you

Exit mobile version