నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

-

నీట్ పేపర్ లీక్,పరీక్షల నిర్వహణలో అవకతవకలపై దేశవ్యాప్తంగా నిరసనలు , ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈరోజు నీట్ వివాదం పార్లమెం ట్ ను కుదిపేసింది.ఈ క్రమంలో నీట్ పై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నీట్ ను రద్దు చేయాలంటూ అసెంబ్లీ లో తీర్మానం ఆమోదించింది. కేంద్రం ప్రభుత్వం వెంటనే నీట్ ను రద్దు చేయాలని తమిళనాడు డిమాండ్ చేస్తుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నుంచి తమిళనాడు రాష్ట్రాన్ని మినహాయించాలని కోరింది. అంతేకాకుండా మెడికల్ కాలేజీ ల్లో మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు నీట్ కంటే ముందున్నట్లు రాష్ట్రాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.నీట్ పరీక్ష నిర్వహణపై దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, పరీక్షపై వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకొని నీట్ ను రద్దు చేసేందుకు జాతీయ వైద్య కమిషన్ చట్టాన్ని సవరించాలని అసెంబ్లీ తీర్మానంలో తెలిపింది. ఈ తీర్మానాన్ని తమిళనాడు బీజేపీ వ్యతిరేకించింది. సభనుంచి వాకౌట్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news