పోలవరం పై చంద్రబాబు చెప్పేవన్ని అసత్యాలే : అంబటి రాంబాబు

-

పోలవరం పై చంద్రబాబు చెప్పేవన్ని అసత్యాలేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేశారు. శ్వేత పత్రం విడుదల చేసిన తరువాత చంద్రబాబు మీడియాతో మాట్లాడిన సందర్భంలో గతంలో పోలవరం ప్రాజెక్టు సంక్లిష్టం అని.. నాకు అర్థం కావడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్న వ్యాఖ్యలకు చంద్రబాబు నవ్వారు. 

దానికి కౌంటర్ గా తాజాగా అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎన్నో అనుమతులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. చంద్రబాబు అసత్యాలు చేస్తుంటే కోపం వస్తుందన్నారు.  పదే పదే జగన్ దూషించే ప్రయత్నం చేశారు.  జగన్ అంటే చంద్రబాబుకు భయం అన్నారు. పోలవరం చాలా సంక్లిష్టమైనది.. నాకు అర్థం కాలేదని ఇప్పటికీ ఒప్పుకుంటున్నాని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు కూడా అర్థం కాలేదన్నారు. 7 గ్రామాలు కలిపినందుకే గొప్పగా చెబుకుంటున్నారు. వైఎస్ హయాంలో తీసుకొచ్చిన అనుమతులు.. పోలవరం ప్రాజెక్టు గురించి ఎంత గొప్పగా చెప్పుకోవాలని ప్రశ్నించారు. చంద్రబాబు మీరు గతంలో చెప్పిన మాటలను ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news