మణిపూర్ రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల వలన దేశం అంతా దుఃఖంలో ఉంది. వెలుగులోకి రాని ఎన్నో అమానవీయ ఘటనలు ఈ రాష్ట్రంలో జరిగినట్లు తెలుస్తోంది. మణిపూర్ రాష్ట్ర పరిస్థితుల గురించి తెలుసుకుని చలించిపోయిన తమిళనాడు సీఎం స్టాలిన్ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. మణిపూర్ లో జరిగిన గొడవలు వివాదాల వలన వేలకొద్దీ ప్రజలు పునరావాస శిబిరాలలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ ప్రజలను తమకు తోచినంతగా సాయం చేయడానికి తమిళనాడు ప్రభుత్వం ముందుకు వచ్చింది. వీరికి ఉపయోగపడే విధంగా రూ. 10 కోట్ల విలువైన సామాగ్రిని పంపుతున్నట్లు సీఎం స్టాలిన్ మణిపూర్ సీఎం బీరేం సింగ్ కు లేఖ రాశారు. ఎన్నో కష్టాలలో ఉన్న మణిపూర్ రాష్ట్రానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. కాగా ఇప్పుడుఇప్పుడే పరిస్థితులు ఆ రాష్ట్రంలో చక్కబడుతున్నట్లు ఉంది.
దేశం అంతా మణిపూర్ వైపే కన్నేసి ఉంది, మణిపూర్ ఘటనలకు కారణమైన ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం పట్టుకుని శిక్షిస్తోంది.